
andhra pradesh tourism development corporation
రాష్ట్రంలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం ప్రపంచ స్థాయి ప్రాజెక్టులకు ఏపీ ప్లాన్ చేస్తోంది. ఏపీలో జాయింట్ వెంచర్లలో పెట్టుబడి పెట్టేందుకు జాతీయ స్థాయి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఉన్న టెక్నాలజీని రాష్ట్రానికి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు ఏపీటీడీసీ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లండన్ లో జరిగిన ఇంటర్ నేషనల్ ఎక్స్పో జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున వరప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. అన్ని కంపెనీలతో సంప్రదించి రాష్ట్రంలో ఉన్న వనరులను, టూరిజం పాలసీ గురించి ఆయన అక్కడ డెలిగెట్స్ కు వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ స్థాయి కంపెనీలతో మాట్లాడినట్లు చెప్పారు. ఇందుకు పలు కంపెనీలు సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.
టర్కీకి చెందిన పోలిన గ్రూప్ లాంటి 11 పెద్ద కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ప్రైవేటు పెట్టుబడి దారులను సంప్రదించి రాష్ట్రంలో వాటర్ ఫాల్స్‌ను ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. టెక్నాలజీని చూపించి పెట్టుబడులు తేవడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
ప్రస్తుతం లండన్ ఐ అనే కంపెనీని వైజాగ్‌లో ఏర్పాటుకు అన్ని కార్యకలాపాలు జరుగుతున్నాయి. పీపీపీ పద్ధతిలో పెట్టుబడులు రాబట్టి రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.