
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 30 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ సేవల ద్వారా ప్రజలు 161 ప్రభుత్వ సేవలను తమ మొబైల్ నుంచే సులభంగా పొందవచ్చు.
ఈ కొత్త వ్యవస్థ ద్వారా దేవాదాయ, విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ శాఖల సేవలు అందుబాటులో ఉంటాయి. అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల సేవలు కూడా వాట్సాప్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది.అదనంగా, ప్రజలు విద్యుత్ బిల్లులు, పన్నుల చెల్లింపులు చేయగలరు. దేవాలయాల్లో దర్శనాలు, వసతి గదుల బుకింగ్, విరాళాల సమర్పణ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా సులభతరం అవుతుంది.
పర్యాటక ప్రదేశాల సమాచారం, టికెట్ బుకింగ్ వంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే, భూ రికార్డులు, ఆదాయ ధ్రువీకరణ వంటి సర్టిఫికెట్లను కూడా ప్రజలు వాట్సాప్ ద్వారా పొందగలరు.
వాట్సాప్ ఖాతాకు మెటా వెరిఫైడ్ ట్యాగ్ ఉంటుంది. ఈ సేవలను ఐటీ మంత్రి నారా లోకేష్ గురువారం అధికారికంగా ప్రారంభించనున్నారు.