
GSDP Growth Rate
రెండంకెల వృద్ధి రేటుతో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. రాష్ట్రం 11.43శాతం జీఎస్ డీపీ వృద్ధి రేటును నివేదించింది. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశం 8.7శాతం జీడీపీ వృద్ధి రేటు కంటే.. రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువ కావడం గమనార్హం.
భారత్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా మూడో ఏడాది కూడా ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. పెట్టుబడులు, ఉపాధి, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైందని సర్కారు పేర్కొంది. 2022 జనవరి నుంచి జూలై వరకు భారతదేశం అంతటా రూ. 1,71,285 కోట్ల పెట్టుబడులు వస్తే.. అందులో రూ.40,361 కోట్లను ఏపీనే ఆకర్షించడం గమనార్హం.
పోర్ట్ ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అత్యుత్తమంగా నిలిచిన ఏపీ.. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డును కూడా గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రి గుడివాడ అమర్నాథ్ ఢిల్లీలో అవార్డును అందుకున్నారు.
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వతల గ్రామంలో ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ ద్వారా రూ. 1,790 కోట్ల పెట్టుబడి పెట్టబడింది, ఇది సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్వహించబడుతుంది మరియు 1,045 ఉద్యోగాలను సృష్టిస్తుంది.
వైఎస్సార్ పెన్షన్ కానుక
జగనన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ సిటిజన్లు, ఇతర అర్హులైన వర్గాలకు నెలవారీ పింఛన్ ను అందజేస్తుంది. ప్రతినెలా గ్రామ వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇంటింటికీ పింఛన్లు ప్రభుత్వం అందజేస్తోంది.
సెప్టెంబర్ నెలకు గాను అక్టోబర్ 1 నుంచి 62.53 లక్షల మంది పింఛనుదారులకు రూ.1,590.50 కోట్లను ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు.
గత ఏడు సంవత్సరాల్లో సెప్టెంబర్ నెలలో విడుదల చేసిన మొత్తం పింఛన్ వివరాలు ఇలా..
సెప్టెంబర్ 2022 – రూ. 1,590.50 కోట్లు
సెప్టెంబర్ 2021 – రూ. 1,397 కోట్లు
సెప్టెంబర్ 2020 – రూ. 1,429 కోట్లు
సెప్టెంబర్ 2019 – రూ. 1,235 కోట్లు
సెప్టెంబర్ 2018 – రూ. 477 కోట్లు
సెప్టెంబర్ 2017 – రూ. 418 కోట్లు
సెప్టెంబర్ 2016 – రూ. 396 కోట్లు
సెప్టెంబర్ 2015 – రూ. 405 కోట్లు