
br ambedkar konaseema district
- బాలిక అనారోగ్యంపై చలించిన ముఖ్యమంత్రి
- రూ. కోటి మంజూరు చేసి అండగా నిలిచిన సీఎం జగన్
డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా ప్రతి ఒక్కరి మనసునూ కదిలించే సంఘటన చోటు చేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ చిన్నారి అరుదైన వ్యాధితో బాధ పడుతోందని బాలిక తల్లిదండ్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. చిన్నారి కష్టాన్ని తెలుసుకున్న సీఎం జగన్ తక్షణమే స్పందించి, వైద్యానికయ్యే ఖర్చుతోపాటు, చిన్నారి చదువు కోసం పూర్తి ఆర్థిక సహకారాన్ని అందిస్తానని అక్కడికక్కడే ప్రకటించారు. అంతే కాకుండా వెనువెంటనే రూ. కోటి మొత్తాన్ని మంజూరు చేసి, బాలిక కుటుంబానికి అండగా నిలిచారు.
అల్లవరం మండలం నక్కా రామేశ్వరానికి చెందిన రాంబాబు, నాగలక్ష్మిల కుమార్తె మూడు సంవత్సరాల వయసున్న చిన్నారి కాలేయ సంబంధిత(గాకర్స్) వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి, వైద్యంలో భాగంగా 52 ఇంజక్షన్ల ఖర్చుకు సీఎం జగన్ పెద్ద మనసుతో ఆసరాగా నిలిచారు. గోదావరి జిల్లాల వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా గంటి పెదపూడిలో సీఎం జగన్ పర్యటించారు. కూతురి వైద్య ఖర్చు సహాయార్థమై తల్లిదండులు ప్లకార్డు పట్టుకొని సీఎం జగన్ కి కనిపించారు. వెంటనే కాన్వాయిని ఆపి పెద్ద మనుసుతో స్పందించిన జగన్ ఈ వ్యాధి చికిత్సకు కావాల్సిన కోటి రూపాయల సహాయం అందిస్తానని భరోసా కల్పించారు. మాట ఇవ్వడమే కాకుండా రెండు నెలల వ్యవధిలోనే కోటి రూపాయలు అందించి తల్లిదండ్రుల్లో మనోధైర్యాన్ని నింపారు. వైద్యంతో పాటు చిన్నారి మందుల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. చిన్నారి చదువుకోవడానికి పూర్తి ఖర్చుతో పాటు నెలకి 10వేల పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా హామీ ఇచ్చారు.
దీనితో ఆ తల్లిదండులు సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.తమ కూతురికి ప్రాణాలు నిలిపేందుకు సహాయం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తల్లిదండులు కృతజ్ఞలను తెలిపారు. దీనితో పేదలకు సీఎం జగన్ అండగా నిలబడతారని మరోసారి నిరూపితం అయ్యింది, సీఎం జగన్ స్పందించిన తీరు రాష్టంలో ప్రతి పేదవారికి ఒక మనోధైర్యాన్ని కలిగిస్తుంది. మాములుగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద అవసరం బట్టి 10 లక్షల వరకు సహాయం పొందే అవకాశం ఉంటుంది, కానీ సీఎం జగన్ ఆ తల్లిదండుల బాధను, పాప యొక్క భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని కోటి రూపాయల సహాయాన్ని అందించారు.