
• ఆంధ్రప్రదేశ్ లో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు
• 2 నెలల్లో 6 వేల కోట్లు దాటిన లిక్కర్ సేల్స్
ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయని ఎక్సైజ్ శాఖ తెలియచేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ తీసుకొచ్చి ప్రైవేట్ మద్యం షాపులకు అనుమతిచ్చిన విషయం విదితమే. అక్టోబర్ 16వ తేదీ నుండి కొత్త మద్యం షాపులు మందుబాబులకు అందుబాటులోకి వచ్చాయి. నాటి నుండి డిసెంబర్ 29 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 6312 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
ఈ 75 రోజుల్లో బార్లు, వైన్ షాపులు కలిపి మొత్తం 26 లక్షలకు పైగా బీర్ కేసులు, 83 లక్షలకు పైగా మద్యం కేసులు అమ్మినట్టు చెపుతున్నారు. ఇక నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 మరియు జనవరి 1 తేదీల్లో మద్యం అమ్మకాలు మరింతగా పెరగనున్నాయి.