
గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ప్రకటించారు,చంద్రబాబు గత 15 ఏళ్లుగా వైఎస్ జగన్పై తప్పుడు ప్రచారాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు, అదానీ దగ్గర లంచం తీసుకున్నారని ప్రచారం చేస్తున్నారనేది పూర్తిగా నిరాధారమైన ఆరోపణ.” ఆయన ఈ దుష్ప్రచారాన్ని ఆపకపోతే, ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి పత్రికలపై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని జగన్ హెచ్చరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, టిడీపీ అనుబంధ పత్రికలు ఇదే పనిగా తప్పుడు రాతలు రాస్తున్నాయి. వైఎస్ జగన్ ప్రతిచర్యగా వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు.
విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం SECI తో ఒప్పందం కుదుర్చుకున్న విషయంపై కూడా అమర్నాథ్ స్పందించారు. కేబినెట్ లో చర్చించిన తర్వాత SECI తో ఈ ఒప్పందం జరిగింది. SECI తో ఒప్పందం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి, 45 రోజులు అధ్యయనం చేసిన తరువాత ఒప్పందం కుదుర్చుకున్నాం.
గుడివాడ అమర్నాథ్ అదానీని కలిసే విషయంలో మాట్లాడుతూ, “వైఎస్ జగన్ అదానీని కలిస్తే దాన్ని తప్పుగా చూపిస్తున్నారు, కానీ చంద్రబాబు అదానీని కలిస్తే అది గొప్పగా చెప్పుకుంటారు. చంద్రబాబు 5 రూపాయల యూనిట్ కంటే వైఎస్ జగన్ 2.49 పైసలకు విద్యుత్ కొనుగోలు చేసారు.
అన్ని రాష్ట్రాల కంటే తక్కువ రేటుకు విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నది మన రాష్ట్రమే. 86 వేల కోట్ల బారం రాష్ట్రానికి వేసిన చంద్రబాబు గొప్పనా? వైఎస్ జగన్ రాష్ట్రానికి లక్ష పదకొండు వేల కోట్లు మిగిల్చినందుకు గొప్పన?” అని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి. కానీ ఇప్పుడు 20 వేల కోట్లు ప్రజలపై భారం వేసేలా పరిస్థితే ఏర్పడింది. చంద్రబాబు ప్రజల పక్షాన పోరాటం చేస్తేనే మంచిది,” అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.