
maha padayatra
అనంతరం రథాన్ని వెంకటపాలెం గ్రామంలోకి తీసుకెళ్లారు. అనంతరం జెండా ఊపి పాదయాత్రను యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. పాదయాత్రలో వేంకటేశ్వరస్వామి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాదయాత్ర లో పార్టీలకు అతీతంగా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మాజీ మంత్రులు మాగంటి బాబు, కామినేని శ్రీనివాస్, సీపీఐ నేత నారాయణ కాసేపు రథం నడిపారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో పాటు పలువురు తెదేపా, భాజపా, కాంగ్రెస్, జనసేన, వామపక్షాల నేతలు రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు. వెంకటపాలెం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర.. కృష్ణాయపాలెం, యర్రబాలెం మీదుగా సాయంత్రానికి మంగళగిరి చేరుకుంటుంది. రాత్రి అక్కడే బస చేస్తారు. మొదటి రోజు దాదాపు 15 కి.మీ. మేర నడవనున్నారు.