
అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకు వరల్డ్ బ్యాంక్ (WB) 800 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. ఈ రుణం అమరావతిని ఒక అభివృద్ధి కేంద్రంగా రూపాంతరం చేసేందుకు అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (AIUDP) కోసం వినియోగించబడనుంది. అమరావతిని పర్యావరణ రక్షణకు అనుగుణంగా, సమగ్రంగా అభివృద్ధి చేయడం. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్లోని పౌరులకు, ముఖ్యంగా మహిళలు, యువత, మరియు ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తులకు ఆర్థిక అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్టులో అమరావతికి 217 చ.కి.మీ విస్తీర్ణంలో మాస్టర్ ప్లాన్ రూపొందించబడింది. ఈ ప్రణాళిక ప్రకారం, 2050 నాటికి 3.50 మిలియన్ జనాభాను ఆశ్రయించేలా అమరావతిని అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఉంది. ఇందులో భాగంగా, ప్రైవేట్ సెక్టార్ పెట్టుబడులను ఆమోదించడం, అర్హత కలిగిన గృహాల నిర్మాణం వంటి చర్యలు చేపట్టనున్నారు .
ఇంతవరకు ప్రస్తుత ప్రభుత్వం పేర్కొన్నట్లుగా, మునుపటి ప్రభుత్వం పెద్ద మొత్తంలో అప్పులు చేసినా, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం 800 మిలియన్ డాలర్ల రుణాన్ని తీసుకుంది. ఈ భారీ రుణాలను ఎవరు తిరిగి చెల్లిస్తారు? ఇది నిజంగా ఎలాంటి ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయం అని పలువురు భావిస్తున్నారు.
ప్రభుత్వం అనుకున్న విధంగా అమరావతిని అభివృద్ధి చేస్తే, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఎటువంటి ఫలితాలను చూపిస్తుంది? ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుందా, లేక మిగతా ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం చూపుతుందా?