
nandamuri balakrishna
టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలయ్య ఏది చేసినా ప్రత్యేకమనే చెప్పాలి. వయసు 60 ఏళ్లు దాటినా.. యూత్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక సీనియర్ యాక్టర్ బాలకృష్ణ. ఒక వైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. ‘అన్ స్టాపబుల్’ అంటూ టాక్ షోతో అదరగొడుతున్నారు. అల్లు శిరీష్, అను ఇమాన్యుయేల్ జంటగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో జరిగిన ఓ సంఘటన ఆసక్తికర చర్చకు దారి తీసింది.
ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షో.. బాలయ్య ఇమేజ్ ను మరింత పెంచింది. ఈ క్రమంలో ఈ షో అల్లు ఫ్యామిలీతో బాలకృష్ణ అనుబంధాన్ని మరింత పెంచిందనే చెప్పాలి. ఆ అనుబంధంతోనే బాలయ్య.. అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరయ్యారు.
ఈవెంట్ కు స్పెషల్ ఎట్రాక్షన్ అయిన బాలయ్యను అల్లు శిరీష్ కొన్ని కొంటె ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలకు బాలయ్య తనదైన శైలిలో సమాధానం కూడా చెప్పారు. ఈ క్రమంలో ‘మీ సినిమాలో నాకు అవకాశం ఇవ్వరా’ అంటూ బాలయ్యను శిరీష్ కోరాడు. దానికి బాలయ్య అంగీకరించగా.. ఆ బాధ్యతను దర్శకుడు పరశురామ్ కు అప్పజెప్పడం గమనార్హం.
అయితే అంతకు ముందు.. స్టేజీపైన పరశురామ్ మాట్లాడుతూ.. బాలయ్యతో సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ఒక మంచి కథతో త్వరలోనే బాలయ్యను కలవబోతున్నానని, ఆ విషయం అల్లు అరవింద్ కు కూడా తెలుసునని ఈ స్టేజ్ పై పరశురామ్ అన్నాడు.
ఈవెంట్ కు బాలయ్య హాజరు కావడం ప్రేక్షకులు రెండు కొత్త విషయాలు తెలిశాయి. బాలయ్య- పరశురామ్ కాంబోలో సినిమా రాబోతోందనేది ఒకటి కాగా.. ఆ మూవీలో అల్లు ఫ్యామిలీ హీరో శిరీష్ నటించే అవకాశాలు ఉన్నాయి.