
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా గాడ్ ఫాదర్. మలయాళం లో మంచి విజయాన్ని అందుకున్న లూసిఫర్ సినిమాకు రీమేక్ గా టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. బ్లాక్ షేడ్స్ లో మెగాస్టార్ గతంలో ఎప్పుడూ లేనివిధంగా చాలా కొత్తగా కనిపిస్తున్నారు.
ఇక మరికొన్ని రోజుల్లో సినిమాకు సంబంధించిన మొదటి టీజర్ ను కూడా విడుదల చేయబోతున్నారు. ఇదివరకే ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సినిమా సంబంధించిన స్పెషల్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. గాడ్ ఫాదర్ లో మెగాస్టార్ చిరంజీవి మరొక షేడ్ కూడా టీజర్ లో హైలెట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈనెల 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు.. కానుకగా.. ఆ టీజర్‌ను విడుదల చేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇదివరకే వారికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా ఫినిష్ అయ్యాయి. ఇక ప్రత్యేకంగా ఒక సాంగ్ కూడా వీరి కలయికలో రాబోతోంది. తప్పకుండా ఆ సాంగ్ ఫ్యాన్స్ అందరికీ చేత విజిల్స్ వేయిస్తుంది అని చిరంజీవి ఇదివరకే వివరణ ఇచ్చారు. ఇక ఈ సినిమాను ఏడాది దసరా సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు.