
డిజిటల్ యుగంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో.. పాన్ కార్డు కూడా అంతే అత్యవరసరంగా మారింది. లావాదేవీలన్నీ పాన్ ఆధారంగా జరుగుతాయి. అంతటి ప్రాముఖ్యత ఉన్న పాన్ కార్డు విషయంలో చాలా మందికి ఒక అనుమానం ఉంది. అదే ఒకరు ఎన్ని పాన్ కార్డులు పొందవచ్చు?
పాన్ కార్డు అనేది ఒకరికి ఒకటి మాత్రమే జారీ చేస్తారు. లావాదేవీలన్నీ పాన్ ఆధారంగా జరుగుతున్న నేపథ్యంలో.. అది దుర్వినియోగం కాకుండా.. చాలా పకడ్బందీగా పాన్ కార్డును జారీ చేస్తారు. ఇప్పటికే పాన్ ఉన్న వ్యక్తి.. తిరిగి కొత్త పాన్ కోసం దరఖాస్తు చేసుకోవడం అసాధ్యం. డేటా బేస్ అందుకు సహకరించదు.
ఒకవేళ.. పాన్ కార్డు పోగొట్టుకుంటే.. అదే పాన్ నంబర్ మీద డూప్లికేట్ పొందవచ్చు. అందుకోసం లీగల్ గా వెళ్లాల్సి ఉంటుంది. తొలుత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా డూప్లికేట్ పాన్ కార్డు తీసుకోవచ్చు. పొరపాటున ఎవరైనా ఒకటికి మించిన పాన్ కార్డులు కలిగి ఉంటే.. అది నేరంగా పరిగణించబడుతుంది. అక్రమంగా ఎవరైనా ఒకటికి మించిన పాన్ కార్డులు కలిగి ఉన్నట్లయితే.. ఆన్ లైన్లో కానీ.. ఆఫ్ లైన్లో కానీ.. ఇప్పుడే సరెండర్ చేయండి.