
హీరోయిన్గా చేస్తానేమో
తెలుగు తేజం పీవీ సింధు కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం కొట్టి ఫుల్ జోష్ మీద ఉంది. అంతర్జాతీయ వేదికలపై భారత జెండాను రెపరెపలాడించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. అయితే ఆమె పర్సనల్ ఇష్టాఇష్టాల గురించి బయట ఎవరికీ పెద్దగా తెలియదు. తనకిష్టమైన తెలుగు హీరో గురించి అడగ్గా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు చెప్పింది. ఇంకా చాలా మంది ఇస్టమైన నటీనటులు ఉన్నారంది. ఓ టీవీ చానల్‌తో మాట్లాడిన సింధు తాను కూడా నటిగా మారతానేమోనని అభిప్రాయం వ్యక్తం చేసింది. దేశంలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. ఆ విషయంపై ప్రశ్నించగా.. తనపైనా బయోపిక్ తీస్తారేమోనని చెప్పింది. ఒకవేళ తీస్తే తానే హీరోయిన్గా నటించవచ్చని చమత్కరించింది. ప్రేమలేఖలపైనా స్పందించిన సింధు ఎన్నో వచ్చినట్లు చెప్పింది. అందులో 70 ఏళ్ల వృద్ధుడు రాసిందీ ఉందని తెలిపింది. జాతీయ పతాకం గురించి ప్రస్తావించగా ఉద్వేగంతో స్పందించింది. మెడల్ తీసుకునే సమయంలో జాతీయ గీతం వినిపిస్తే కన్నీళ్లు వస్తాయని వివరించింది. జాతీయ పతాకం, జాతీయ గీతం అంటే గర్వంగా అనిపిస్తుందని చెప్పింది. అదే సమయంలో చాలా ఆనందంగా ఉంటుందని సింధు వివరించింది.