
అమరావతి: వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా ముస్లిం కమ్యూనిటీ హక్కులకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం మతపరమైన చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తుందని, ఈ బిల్లు వక్ఫ్ ఆస్తులను కాజేసే కుట్రలో భాగమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
వక్ఫ్ బిల్లుపై కాంగ్రెస్ ఆగ్రహం
ప్రస్తుత వక్ఫ్ బిల్లులోని సవరణలు ముస్లింలకు ఎలాంటి మేలు చేయవని, ఇది ముస్లిం హక్కులను హరిస్తోందని షర్మిలా పేర్కొన్నారు. బోర్డు అధికారాలను ప్రత్యేక అధికారులకు అప్పగించడం, బోర్డులో నాన్-ముస్లింలను చేర్చడం అన్యాయమని పేర్కొన్నారు.
“హిందూ దేవాలయాల బోర్డుల్లో ముస్లింలను పెట్టారా? అదే సూత్రాన్ని వక్ఫ్ బోర్డుపై ఎందుకు ప్రయోగిస్తున్నారు?” అంటూ షర్మిలా నిలదీశారు.
బీజేపీని మద్దతిచ్చిన చంద్రబాబు సమాధానం చెప్పాలి
ఈ బిల్లుకు సంబంధించి చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. ముస్లింల ఓటు తీసుకున్నా, వారిపట్ల అన్యాయం చేయడాన్ని ఎలా సమర్థిస్తారని నిలదీశారు.
“బీజేపీకి మద్దతిచ్చి, ఇప్పుడు ముస్లింలకు వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇఫ్తార్ విందులు ఇచ్చి, వక్ఫ్ బిల్లుకు మద్దతివ్వడమేంటి?” అంటూ విమర్శించారు.
అవినాష్ రెడ్డి కేసులో మళ్లీ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన షర్మిలా, ఇన్వెస్టిగేషన్ అధికారిని ఒత్తిడి చేసి తప్పుడు నివేదిక ఇచ్చించారని ఆరోపించారు.
“బెయిల్ మీద ఉన్న వ్యక్తి సాక్ష్యాలను తారుమారు చేస్తే, బయట తిరగడం సబబేనా?” అని ఆమె ప్రశ్నించారు.
ప్రవీణ్ పగడాల ఘటనపై స్పందన
ప్రవీణ్ పగడాల హత్య కేసును రాజకీయ కోణంలో చూడొద్దని, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని షర్మిలా సూచించారు.
“బీజేపీ కుట్రలో భాగంగానే మతాల మధ్య విభజన తేవాలని చూస్తున్నారు. మన రాష్ట్రంలో అలాంటి సంస్కృతి లేదు, ఉండకూడదు” అని అన్నారు.
Also read:
https://deccan24x7.in/telugu/tdp-supports-waqf-bill-controversy/