
పిఠాపురం: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో రికార్డింగ్ డాన్స్లు కలకలం రేపుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలోని యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా రికార్డింగ్ డాన్స్లు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది.
ఈ కార్యక్రమంలో 12 మంది అమ్మాయిలతో శృంగారభరిత నృత్యాలు సాగడం, యువతను రెచ్చగొట్టే పాటలు వాడటం స్థానిక ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. అర్థరాత్రి వరకు జరిగిన ఈ డాన్స్ షోలు గ్రామంలో దారుణ స్థితిని సృష్టించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
ఈ వేడుకలకు అనుమతి ఇచ్చినట్లు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. స్థానికులు అనుమతి లేకుండా ఇలాంటి అశ్లీల కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇప్పటికీ అధికారుల స్పందన రాకపోవడం ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేసింది.
ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు
డిప్యూటీ సీఎం నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండటం ప్రభుత్వ విధానాలపై అనేక సందేహాలను కలిగిస్తున్నాయని విమర్శకులు అంటున్నారు. సాంస్కృతిక, భక్తి కార్యక్రమాల పేరుతో అసాంఘీక కార్యకలాపాలకు ప్రోత్సాహం అందుతోందా? అనే ప్రశ్నలు వేడెక్కుతున్నాయి.
Also read:
https://deccan24x7.in/telugu/bhuma-akhila-priya-extortion-allegations/