తిరుపతి, 12 ఫిబ్రవరి 2025: తిరుమలలో వున్న టిటిడి పరిపాలనా భవనం ఎదుట హిందుత్వ సంఘాలు, స్వామీజీలు ఆందోళన ప్రారంభించారు. అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ కు కేటాయించిన స్థలాన్ని తిరిగి తీసుకోవాలనే డిమాండ్ తో ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
ఈ ఆందోళనకు శ్రీనివాసానంద సరస్వతి స్వామి నాయకత్వంలో హిందుత్వ సంఘాలు ఉత్కంఠ భరితంగా నిరసన తెలిపాయి. “తిరుమల ఏడుకొండలను రక్షించుకుందాం” అనే నినాదంతో వారు ఈ నిరసనను ముందుకు తీసుకెళ్ళారు.
ఇక, “సనాతన ధర్మం” అనే విషయంపై ప్రచారం చేసిన డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ పై ప్రశ్నలతో హిందుత్వ సంఘాలు ఆందోళన సాగిస్తున్నాయి. “సనాతన ధర్మం కోసం ఏమైనా చేస్తాం అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడ?” అని ప్లకార్డులలో ప్రశ్నలు రాశారు.
“వారాహి డిక్లరేషన్ అంటే ఏడు కొండలను నాశనం చేయడమా?” అంటూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. “సనాతన ధర్మ రక్షకుడు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ?” అని నిరసన వ్యక్తం చేశారు.
ఆందోళన మరింత ఉదృతంగా మారడంతో, స్థానిక పోలీసులు పరిస్థితిని నియంత్రించడానికి రంగంలోకి దిగారు. హిందుత్వ సంఘాలు టిటిడి పరిపాలనా భవనం వద్ద తమ డిమాండ్లను ప్రభుత్వానికి చేరవేయాలని కోరారు.