
2024లో మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనకి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రధాని మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు మరియు పలు ముఖ్యమైన ప్రాజెక్టుల శంకుస్థాపన చేశారు.
విశాఖపట్నంలో ప్రధానంగా ఇక్కడి రైల్వే జోన్ ప్రారంభం, అలాగే అనకపల్లి జిల్లా పుడిమడకలో NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపన , NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మరియు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (NREDCAP) సంయుక్తంగా ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు 1,200 ఎకరాల్లో గంగవరాం సీపోర్టు సమీపంలో ఏర్పడనున్నది . ఈ హబ్ గ్రీన్ యామ్మోనియా, గ్రీన్ మెథనాల్ మరియు యూరియా ఉత్పత్తి చేయడం లక్ష్యంగా రూ. 1.85 లక్షల కోట్లు పెట్టుబడిగా , 2032 నాటికి 57,000 ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉన్న ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు దేశానికి ఆర్థికపరమైన కొత్త దిశను తీసుకొస్తుంది అని ప్రస్తావించారు.
ప్రధాని మోదీని స్వాగతించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ ప్రాజెక్టుల శంకుస్థాపన రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన అడుగు అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు భారతదేశం గ్రీన్ ఎనర్జీ మార్గంలో ముందడుగు వేయడంలో ఈ ప్రాజెక్టులు ముఖ్యమైన భాగం అవుతాయని తెలిపారు.