
Chandrababu
టీడీఎల్పీ సమావేశంలో అధినేత చంద్రబాబు నిర్ణయం!
టీడీఎల్పీ సమావేశంలో అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి పార్టీ టికెట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ముందస్తు ఎన్నికల అంచనాల నేపథ్యంలోనే చంద్రబాబు ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఏపీ రాజధాని అంశంపై టీడీఎల్పీలో జరిగిన చర్చ సమయంలో అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు దీటుగా మాట్లాడేందుకు సిట్టింగ్ లకే టికెట్లను ఖరారు చేస్తామన్న హామీ ఇచ్చినట్లు ప్రచారం తెలుస్తోంది. జిల్లాలు, పార్లమెంట్ వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు 2024 ఎన్నికల్లో టికెట్లు ఖాయమని చెప్పడం వల్ల వారు బాగా పని చేస్తారని, ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్తారనేదే చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు వ్యతిరేకించే వారిని కలుపుకొని పోయేందుకు అవకాశం ఉంటుందనేది ఆలోచనగా ఉంది.
సిట్టింగ్ లకు టికెట్లు ఖాయమనే ప్రకటనతో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిలోనూ జోష్ నింపుతుందని, పార్టీ ప్రచారం ఊపందుకుంటుందని భావిస్తున్నారు. అలాగే నియోజకవర్గ ఇన్ చార్జులుగా ఉన్న టీడీపీ నేతలకూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లవుతుంది. అధికార పార్టీ కన్నా ముందుగానే సీట్లు ఖరారు చేస్తే రెబెల్స్ బెడద తప్పుతుందనే భావనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.