
internship
భారీ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దేశంలోనే తొలిసారిగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 2.5లక్షల మందికి ఈ అవకాశాన్ని కల్పించనుంది ప్రభుత్వం. అతి త్వరలో సీఎం జగన్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంను ప్రారంభించనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ కార్యక్రమాన్ని అముల చేయనుంది. ప్రొఫెషనల్, కన్వెన్షనల్ డిగ్రీ కోర్సుల్లో కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీలు ఇంటర్న్‌షిప్ కోసం వర్చువల్, ఫిజికల్ మోడ్లలో కోర్సులు నిర్వహించనున్నాయి.
సెకండ్ సెమిష్టర్ పరీక్షలు పూర్తయిన తర్వాత మొదటి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఇంటర్న్‌షిప్ మొదలవుతుంది. నాలుగో సెమిష్టర్ అయ్యాక రెండో ఇంటర్న్‌షిప్ నిర్వహిస్తారు. 2020-21లో రివైజ్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ కరికులమ్ ఆధారంగా ఆరో సెమిష్టర్ పూర్తయ్యాక.. చివరిసారి ఇంటర్న్‌షిప్ జరుగుతుంది. ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం కాలవ్యవ్యవధిని 10నెలలుగా నిర్ణయించారు. టెక్నికల్, ప్రాక్టికల్‌గా తయారవ్వడానికి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది.
2లక్షల 43వేల మంది విద్యార్థుల ఇంటర్న్‌షిప్ కోసం విస్తృత ఏర్పాట్లు చేశాం. వచ్చే ఏడాది నుంచి వీటి సంఖ్యను పెంచుతాం. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 2021లో పాఠ్యాంశాలను సవరించినప్పటి నుంచి బీఎస్సీ, బీకామ్, బీఏ చదివే రెండో సంవత్సరం డిగ్రీ విద్యార్థులు మాత్రమే రెండు నెలల పాటు ఇంటర్న్‌షిప్‌లు వినియోగించుకోవడానికి వీలు కలుగుతుంది.
– ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్ర రెడ్డి
ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, పొలాల్టో, సేల్స్‌ఫోర్స్ లాంటి ఎమ్మెన్సీలతో 1.34లక్షల మందికి ఏపీఎస్సీహెచ్ఈ వర్చువల్ ఇంటర్న్‌షిప్ అందించనున్నారు. అందుకో 45,370మంది కన్వెన్షల్ డిగ్రీ స్టూడెంట్ ఉంటారు. మిగిలిన వారంతా ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారే. 1,12,847 మంది స్టూడెంట్లను 10 యూనివర్సిటీలకు కేటాయించారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంలను నిర్వహించాలనుకుంటున్నట్లు ప్రొఫెసర్ హేమచంద్రా రెడ్డి అన్నారు.