
pawan
2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నజనసేన-బీజేపీ స్నేహబంధంపై ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండు పార్టీల ఉన్న బంధానికి బీటలు వారాయా? జనసేనాని బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తుంటే.. కాషాయ దళం కావాలనే పవన్ కావాలనే పక్కన పెడుతుందా? అసలు జనసేన-బీజేపీ మధ్య ఏం జరుగుతోంది?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో సత్తా చాటేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2024 ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పొషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మధ్య కాలంలో బీజేపీని ముఖ్యంగా ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మోదీ ఏం చేసినా.. పవన్ దానికి దానికి మద్దతు తెలుపుతున్నారు. ఇటీవల ఆగస్టు 15న ఇంటింటా జెండా ఎగరేయమన్న మోదీ నిర్ణయాన్ని నిర్ణయాన్ని స్వాగతించారు.
ఆజాదీ అమృత్ మహోత్సవం సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను కూడా పవన్ కల్యాణ్ స్వాగతించారు. ముఖ్యంగా బ్రిటిష్ కాలం నాటి పేర్లను మార్చేసే నిర్ణయాన్ని ప్రశంసిస్తున్న ఒక లేఖను కూడా విడుదల చేశారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని గొప్ప నిర్ణయంగా అభివర్ణించారు. బ్రిటిష్ కాలం నాటి గాయాలను మార్చేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నం హర్షణీయం అన్నారు. చివరకు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే విషయంలో కూడా పవన్ కల్యాణ్ కేంద్రంపై మెతక వైఖరినే అవలంబించారు. ఇలా ఆర్టికల్ 360 నుంచి ఆజాదీ అమృత్ మహోత్సవం సందర్భంగా తీసుకున్న నిర్ణయాల వరకు మోదీని వెనకేసుకుంటూ వచ్చారు పవన్.
ఇలా ప్రతి సందర్భంలో మోదీని, బీజేపీని వెనకేసుకొస్తున్న పవన్ పై కాషాయదళం కనీస ప్రేమను కూడా కనబర్చడం లేదని జన సైనికులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని బీజేపీ కీలక నేతలు గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఇటీవల బీజేపీ- జనసేన ఉమ్మడి కార్యచరణతో చేసిన కార్యక్రమాలు ఏవీ లేకపోవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. బీజేపీ తమ కార్యక్రమాలకు కావాలనే పవన్ ను ఆహ్వానించడం లేదనేది ప్రధానంగా జనసైనికుల నుంచి ఆరోపణ. అంతేకాదు.. జనసేన కార్యక్రమాలకు బీజేపీ నాయకులను ఆహ్వానించినా.. వారు రావడం లేదట.
బీజేపీ కీలక నాయకులు జనసేనతో దూరంగా ఉండటానికి కారణాలు కూడా లేకపోలేదు.
ఎన్నికలప్పుడు రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయడంంలో ఇరు పక్షాలకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఎన్నికలు లేని ఈ సమయంలో జనసేనతో కలిసి కార్యక్రమాలు చేస్తే.. ఆ క్రెడిట్ పవన్ కల్యాణ్ కే దక్కుతుందనే భావనలో కాషాయ పార్టీ ఉంది.
2019 ఎన్నికలకు ముందు .. మోదీపై పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని దుయ్యబట్టారు. ఆ మాటలను రాష్ట్ర బీజేపీ నాయకులు ఇంకా మరిచిపోలేకపోవడం కూడా మరో కారణం కావొచ్చు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ముర్ము గెలిచారంటే.. వైసీపీ ఇచ్చిన మద్దతు వల్లే అనేది అందిరికి తెలిసిన విషయమే. ఈ క్రమంలో రెండు పార్టీలు పరస్పరం దగ్గరవుతున్నయనేది మరో ప్రచారం. వైసీపీకి దగ్గరయ్యేందుకే స్థానిక బడా నేతలు కావాలనే జనసేనను దూరంగా పెడుతున్నట్లు సమాచారం.