
వంట నూనెల విషయంలో కేంద్రం శుభవార్త చెప్పింది. దిగుమతులపై కస్టమ్స్ సుంకం తగ్గింపును మరో 6 నెలలు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయంతో దేశంలోని వంటనూనెల ధరలు అందుబాటులో ఉండనున్నాయి. దీంతో వినియోగదారులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నూనెలపై ప్రస్తుతమున్న కస్టమ్స్ సుంకం 2023 మార్చి 31 వరకు ఉంటుందని ఎస్ఈఏ పేర్కొంది.
ప్రస్తుతం ముడి పామాయిల్, సోయాబీన్ నూనె, సన్ ఫ్లవర్ నూనెపై ఎలాంటి దిగుమతి సుంకం లేదు. కాని అయితే 5శాతం అగ్రి సెస్సు, 10 శాతం సంక్షేమ సెస్సును పరిగణనలోకి తీసుకుంటే.. ఈ మూడు రకాల నూనెలపై 5.5 శాతం సుంకం వర్తిస్తోంది. శుద్ధిచేసిన పామోలిన్, పామాయిల్‌కు బేసిక్ కస్టమ్స్ సుంకం 12.5 శాతం కాగా.. సంక్షేమ సెస్సు 10శాతంగా ఉంది. రిఫైన్డ్ సోయాబీన్, సన్ ఫ్లవర్ నూనెపై బేసిక్ కస్టమ్స్ 17.5 శాతం కాగా.. 10 శాతం సోషల్ వెల్ఫేర్ సెస్సును లెక్కలోకి తీసుకుంటే వర్తించే సుంకం 19.25 శాతం అవుతోంది.
ద్రవ్యోల్బణాన్ని దృష్టింలో పెట్టుకొని.. 2021 అక్టోబరులో సోయబీన్, పామాయిల్‌పై కస్టమ్స్ సుంకం, అగ్రి, మౌలిక అభివృద్ధి సెస్సును సీబీఐసీ తగ్గించింది. తొలుత 2022 మార్చి 31 వరకు ఈ తగ్గింపును వర్తింపజేశారు. ఆ తర్వాత 2022 సెప్టెంబరు 30 వరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా మరో ఆరు నెలలు పొడింగించారు.